గుకేశ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
34 ఎత్తుల్లోనే చిత్తు
ఓస్లో, జూన్ 5 : నార్వే చెస్ టోర్నీలో భారత ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద దూసుకెళ్తున్నాడు. వరల్డ్ చాంపియన్, మరో భారత ఆటగాడు డీ గుకేశ్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాడు. కీలకమైన మాచ్‌లో కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను ప్రజ్ఞానంద మట్టికరిపించాడు. ఈ విక్టరీ ప్రజ్ఞానందకు ప్రతీకార విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టోర్నీలోనే నాలుగవ రౌండ్‌లో గుకేశ్ చేతిలో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. కాగా ఈ విజయంతో అతను టోర్నీలో ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచాడు.
టోర్నమెంట్ ప్రా రంభంలో వరుస ఓటములతో వెనుకబడిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఆ తర్వాత అనూహ్యం గా పుంజుకుని వరుసగా 3 క్లాసికల్ విజయాలతో హ్యాట్రిక్ సాధించాడు. 7వ రౌండ్లో అలీరెజా ఫిరూజాను, 8వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్‌ను, 9వ రౌండ్‌లో వరల్ ఛాంపియన్ గుకేశ్‌ను సైతం ఓడించి పాయింట్ల పట్టికలో 15 పా యింట్లతో ఒంటరిగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
ప్రస్తుతం టోర్నమెంట్ లీడర్ గా ఉన్న అమెరికాకు చెందిన వెస్లీ సో కంటే ప్రజ్ఞానంద కేవలం హాఫ్ పాయింట్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఇదిలా ఉం టే నార్వే చెస్ మహిళల విభాగంలో భారత్ నుంచి ఎవరూ టైటిల్ రేసులో నిలవలేదు. దివ్య దేశ్ముఖ్ ఐదో స్థానం, కోనేరు హంపి 6వ స్థానంలో నిలిచారు. కజికిస్థాన్‌కు చెందిన బిబిసారా అస్సౌబయేవా అగ్రస్థానంలో ఉంది. ఆమె ఖాతాలో ఇప్పటికే 16.5 పాయింట్లు ఉన్నాయి.






