వైభవ్ పైనే అందరి చూపు
- లంక గడ్డపై భారత్ ఏ జట్టు
- 9 నుంచి ట్రై సిరీస్ షురూ
కొలంబో, జూన్ 5 : శ్రీలంక వేదికగా జరగనున్న ట్రై సిరీస్ కోసం భారత ఏ జట్టు కొలంబో చేరుకుంది. భారత్ ఏ జట్టుతో పాటు శ్రీలంక ఏ, ఆఫ్ఘనిస్థాన్ ఏ జట్ల మధ్య జూన్ 9 నుంచి ఈ సిరీస్ జరగబోతోంది. తిలక్ వర్మ సారథ్యంలోని భారత యువ జట్టు భారీ అంచనాలతో లంకలో ల్యాండయింది. అయితే ఈ టూర్‌లో అందరి చూ పు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించిన ఈ చిచ్చర పిడుగు బ్యాటింగ్ విన్యాసాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేవలం వైభవ్ కోసమే ఈ సిరీస్‌ను బ్రాడ్ కాస్టర్లు లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారంటేనే అతని క్రేజ్ అర్థం చేసుకో వచ్చు. భయం లేని బ్యాటింగ్‌తో రన్స్ రాబడుతూ ఆధునిక క్రికెట్ దిగ్గజాలనే ఆకట్టుకున్న ఈ టీనేజర్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపేందుకు రెడీ అయ్యా డు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లో చిన్న వయసులోనే సెంచరీల మీద సెంచరీలు బాదు తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. లంక స్పిన్ పిచ్ లపై వైభవ్ ఎలా ఆడతాడనే దానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ టోర్నమెంట్‌లో మూడు దేశాలకు చెందిన ఫ్యూచర్ స్టార్స్ తలపడబోతున్నారు. సీనియర్ టీంలోకి వెళ్లాలనుకునే యంగ్ ప్లేయ ర్స్ అందరికీ ఈ వన్డే సిరీస్ ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ఈ రేసులో వైభవ్ సూర్యవంశీ అందరికంటే ముందు వరుస లో ఉన్నాడు. కాగా భారత్ ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా వైస్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేశారు.
ట్రై సిరీస్‌లో ఆడే భారత్ ఏ జట్టు
ప్రియాన్షు ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోనీ, నిశాంత్ సింధూ, అనుకుల్ రాయ్, సూర్యాన్షు షెడ్జే, విప్రాజ్ నిగమ్, రుతురాజ్ గైక్వాడ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కుమార్ కుశాగ్ర, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.






