6 June, 2026 | 1:42 AM

నేడు కొత్త కెప్టెన్ ఎంపిక

06-06-2026 12:00 AM
  1. శ్రేయాస్ పేరే ఖరారు !
  2. వైభవ్‌కు పిలుపు ఖాయమే

ముంబై, జూన్ 5 : భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ ఎవరనేది శనివారం తేలిపోనుంది. దీని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కాబోతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగే సిరీస్ లకు కూడా జట్టును ప్రకటించనున్నారు. మధ్యాహ్నం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెక్రటరీ దేవజీత్ సైకియా మీడి యా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం స్వదేశంలో ఆప్ఘనిస్థాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్ తర్వాత వరుస విదేశీ పర్యటనలతో బిజీ కాబోతోంది.

ఐర్లాండ్‌తో రెండు టీ20 లు, అనంతరం ఇంగ్లాండ్ టూర్, ఆసియా గేమ్స్‌కు సెలక్టర్లు శనివారమే జట్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ ను కూడా ప్రకటించనున్నారు. టీ20 ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ ను తప్పించి శ్రేయాస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగిస్తారని భావిస్తున్నారు. సారథిగా మం చి మార్కులే సాధించిన సూర్యకుమార్ వ్యక్తిగతంగా మాత్రం పూర్తిగా ఫామ్ కోల్పో యాడు.

ఈ క్రమంలో శ్రేయాస్‌తో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి, అయితేసెలక్టర్లు శ్రేయాస్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీనిపై కోచ్ గంభీర్‌తో కాస్త బేధాభిప్రాయాలు వచ్చినా కూడా సెలక్టర్లు శ్రేయాస్ అయ్యర్ పేరు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ జట్టు ఎంపికలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పేరు హాట్ టాపిక్‌గా మారింది.