10 March, 2026 | 3:16 AM

మొయినాబాద్‌లో ‘ప్రజా పాలన’ 5కే రన్ ఉత్సాహం

10-03-2026 12:25 AM

మొయినాబాద్, మార్చి 9(విజయ క్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన  పట్టణ ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన 5కే రన్ అత్యంత ఉత్సాహంగా సాగింది. ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించడంతో పాటు పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ పరుగును నిర్వహించారు.

ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్ మరియు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ జెండా ఊపి ఈ రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అభివృద్ధి పథంలోప్రజా పాలన కార్యక్రమాల ద్వారా పట్టణాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని సోనియా దర్శన్ పేర్కొన్నారు. 

అనంతరం అధికారులు చిలుకూరు నర్సరీని సందర్శించారు.  కార్యక్రమం లో  వైస్ చైర్మన్ గరుగు రాజు కృష్ణ, కౌన్సిలర్ అశోక్ విజయలక్ష్మి, డిప్యూటీ ఇంజనీర్ చిరంజీవి, వార్డ్ ఆఫీసర్ అశోక్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గణేష్ మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.