10 March, 2026 | 3:15 AM

జగన్నాథునికి 108 కలశ పూజ

10-03-2026 12:24 AM

మహబూబాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతాద్రి శ్రీ స్వయంభు జగన్నాథ వేం కటేశ్వర స్వామి వారి ఏకవింశతి 21వ బ్ర హ్మోత్సవములలో భాగంగా 4వ రోజున 108 కలశములతో పూజ నిర్వహించి స్వామివారిని (మూలవరులకు) అభిషేకించారు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీరామ చాలీస్ రచయిత, భక్తి టీవీ ప్రవచకులు శ్రీమాన్ సౌమి త్రి వేణుగోపాలచార్యులు వారిచే ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్టీ చైర్మన్ నూకల రా మచంద్రారెడ్డి, ట్రస్ట్ సభ్యులు నాయిని ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు,గొడవర్తి శ్రవణ్ కుమారాచార్యుల నిర్వహణలో ఈ కార్యక్రమాలు ఘ నంగా నిర్వహించారు. ఆలయ పూజారులు, హేమంత్, సంతోష్, గౌతమ్, విజయ కుమారాచార్యులు, భక్తులు, పాఠశాల విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.