8 June, 2026 | 11:22 PM

వెంకంపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ

08-06-2026 10:12 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై తీర్మానాలు చేసినట్లు తెలిపారు. గ్రామాలలో  తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. గ్రామలలో పారిశుద్ధ్య నిర్మలపై ప్రత్యేక కార్యక్రమంలో చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలోసర్పంచులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు జిపిఓ,ఆశ అంగన్వాడి కార్యకర్త గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.