7 March, 2026 | 1:56 AM

ఆలేరులో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం

06-03-2026 01:32 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మున్సిపాలిటీలో(Alair Municipality) ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక(Praja Palana Pragati Pranalika) కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి, పాలకవర్గ సభ్యులతో శుక్రవారం ఉదయం 7వ వార్డు శివాలయం వీధిలో ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, 99 రోజుల పాటు మున్సిపాలిటీలో ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించి మౌలిక మార్పులు, ప్రజలకు ఆరోగ్యక రమైన వాతావరణం వార్డు సభ్యులు ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి మాట్లాడుతూ  మున్సిపాలిటీ శుభ్రత, పన్నుల వసూళ్ల డ్రైవ్, తాగునీటి వనరుల పరిశీలన, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాల మరమ్మతులు, చెత్త నిర్వహణ చర్యలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గరవుతామని వారి అవసరాలకు అనుగుణంగా వారి సమస్యలను తెలుసుకుని, తీరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, పస్తం ఆంజనేయులు, బీజన కళ్యాణి, బొట్ల సంపత్ మరియు పాలకవర్గ సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది వార్డు సభ్యులు పాల్గొన్నారు.