వేడుకలా ప్రజా పాలన గ్రామసభలు
మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమం అమలులో భాగంగా గురువారం మహబూబాబాద్ జిల్లాలో గ్రామ గ్రామా నా, పట్టణాల్లోని వార్డుల్లో గ్రామసభలు పండగ వాతావరణంలో నిర్వహించారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అలాగే డోర్నకల్ నియోజకవర్గంలోని పెద్ద ముప్పారంలో నిర్వహించిన గ్రామ సభకు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జా టోత్ రామచంద్రు నాయక్, గూడూరు మం డల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభకు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, కేసముద్రం మున్సిపాలిటీలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభకు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ హాజరయ్యారు.
అలాగే ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, వార్డుల్లో వార్డు కౌన్సిలర్లు గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి మంజూరైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయా గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. ప్రభుత్వం ధర వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రజలతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. మహిళ సంఘాలకు, డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్న మహాలక్ష్మి కార్యక్రమాన్ని వివరించారు.




