3 April, 2026 | 3:08 AM

గ్రామసభల్లో సమస్యలు ఏకరువు

03-04-2026 12:00 AM

పలు గ్రామాల్లో అధికారుల గైర్హాజరు 

జహీరాబాద్, ఏప్రిల్ 2 : ప్రతి గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే నెలకొన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం నాడు జరిగిన గ్రామ పంచాయతీ గ్రామసభల్లో ప్రజలు నిలదీశారు. అధికారులు, సర్పంచులతో ప్రజలు వాగ్వివాదానికి దిగారు. తాగునీరు, మురుగు కాలువలు, విద్యుత్తు, రైతు భరోసా వంటి వాటిపై ప్రశ్నించారు. రైతులకు రావలసిన రైతు భరోసా ఎందుకు వేయడం లేదంటూ ప్రశ్నించారు.

కొన్ని గ్రా మాలలో అధికారులు గైరాజరు కావడంతో ఆ శాఖకు సంబంధించిన వివరాలు వెల్లడించడంలో అధికారులు చేతులెత్తేశారు. ఝరా సంగం మండలం కుప్పా నగర్ గ్రామంలో జరిగిన గ్రామసభలో విద్యుత్తు వ్యవసాయ అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక పోయారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరించారు.

సంబంధిత అధికారులు రాకపోతే సభలు ఎందుకు నిర్వహి స్తున్నారంటూ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు  ప్రశ్నించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ తేజస్విని, గ్రామ సర్పంచ్ రాజకుమార్, ఉప సర్పంచ్ వాహబ్, వార్డు సభ్యులు రోహిత్, లాలు, సంగమేశ్వర్, శిరోమణి తదితరులు పాల్గొన్నారు.