4 May, 2026 | 4:55 AM

నేటి నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి

04-05-2026 03:11 AM

కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్ మే 3 (విజయ క్రాంతి) : డివిజన్ స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఒక ప్రకటన లో తెలిపారు.జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి ఇది కొనసాగింపుగా డివిజన్ పరిధిలోని ప్రజలు వారి సమస్యలను ఆర్ డి ఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించవచ్చన్నారు.

ఇక పై ప్రతి సోమవారం ఆర్డిఓ కార్యాలయాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ స్థాయి ప్రజావానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్ డి ఓ లను ఆదేశించారు. ఇక పై ప్రతి సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా అధికారులందరూ వారి శాఖకు సంబంధించిన అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.