వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
చివరి ధాన్యం వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా
శ్రీరంగాపురం, మే 3:మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, చివరి ధాన్యం వరకు రైతులకు పూర్తి భరోసా ఉంటుందని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరగా సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 2389, లావు వడ్లకు రూ. 2369 నిర్ణయించిందని తెలిపారు.
అదనంగా సన్న వడ్లపై రూ. 500 బోనస్ కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయిస్తే రైతులకు లాభం ఉంటుందని అధికారులు సూచించారు. కొనుగోలు కేంద్రంలో తూకం, నాణ్యత తనిఖీలు, చెల్లింపులు పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ శ్రీహరి రాజు, రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, సింగిల్ విండో సీఈవో శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.






