ధనుష్ సరసన..

26-09-2026 | 05:10am

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Kollywood star hero Dhanush) కథానాయకుడిగా ‘డీ56’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ఇటీవలే కోలీవుడ్‌లో ‘లబ్బర్ పందు’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రైమ్‌మార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. తాజా పూజా కార్యక్రమాల సందర్భంగా చిత్ర యూనిట్ భారీ తారాగణాన్ని ప్రకటించింది. ఇందులో ధనుష్ సరసన కథానాయికగా ప్రీతి ముకుందన్(Preethi Mukundan) నటిస్తుండగా.. విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య, ప్రముఖ హాస్య నటుడు వడివేలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఉరియడి’ ఫేమ్ విజయ్‌కుమార్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ మాస్ అండ్ హై-వోల్టేజ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఇది ‘పుష్ప’ తరహాలో సాగే ఊరమాస్ ట్రీట్‌మెంట్‌తో, భారీ యాక్షన్, వయొలెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన పవర్‌ఫుల్ స్క్రిప్టుతో రాబోతోంది. ఈ చిత్రాన్ని 2027 వేసవి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలావుండగా, ప్రీతి ముకుందన్.. స్టార్ హీరో ధనుష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకోవడంతో యంగ్ హీరోయిన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఈ కాంబినేన్‌పై ఇటు ధనుష్ అభిమానుల్లో, అటు సినిమా వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు