గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు
బిజినేపల్లి : తిమ్మాజిపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలిక ప్రేమ పేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడానికి కారణం అయిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిమ్మాజిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వెంట తిరిగాడు. పెళ్ళి చేసుకుంటానని ఆ యువకుడు మైనర్ బాలికతో లైంగికంగా వాడుకోవడంతో ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిలదీశారు. ఇందుకు ఆ యువకుడు నిరాకరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదుతో శుక్రవారం నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు.






