8 May, 2026 | 11:46 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

08-05-2026 11:14 AM

హుజూర్‌నగర్,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...పట్టణంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణానికి (గోవిందపురం) చెందిన రాయిరాల రవి మరో వ్యక్తితో కలిసి స్కూటీపై వెళ్తుండగా డివైడర్ క్రాస్ చేసే సమయంలో హుజూర్‌నగర్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెనుక ఉన్న రవి తలకు తీవ్ర గాయాలు కావడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో హాస్పిటల్ కు తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.