13 April, 2026 | 12:55 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

సీక్వెల్‌కు సన్నాహాలు!

26-02-2026 01:10 AM

తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘జాంబిరెడ్డి’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ టౌన్‌గా మారింది. అప్పట్నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురు ఫలించి ఇప్పుడు ‘జాంబిరెడ్డి 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జాతో మరో సినిమా చేయబోతున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బ్యానర్‌లో రాబోతున్న సినిమాల్లో ‘జాంబిరెడ్డి 2’ చేరింది.

అయితే, ఈ రెండో భాగానికి ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించడం లేదని సమాచారం. ఆయన కేవలం కథనున మాత్రమే అందిస్తున్నారని సినీవర్గాల ద్వారా తెలుస్తోంది. తొలి భాగంలో కన్నా ఈ సీక్వెల్‌లో సన్నివేశాలు మరింత క్రూరంగా, ప్రాణాంతకంగా ఉండేలా కథను సిద్ధం చేస్తున్నారట ప్రశాంత్ వర్మ. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టే డైరెక్టర్ ఎవరు? అనేది ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది.