26 February, 2026 | 6:32 AM

ఈ జిందగీ చాలా చిన్నది..

26-02-2026 01:12 AM

శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించి న చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని మార్చి 6న రిలీజ్ చేయబోతోన్నారు.

ఈ క్రమంలో బుధవారం హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేయించారు మేకర్స్. కాలభైరవ బాణీకి అభినవ కవి సమకూర్చిన ర్యాప్ వెర్షన్ ఆకట్టుకుంటోంది. అభినవ కవి, కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: మనీషా ఏ దత్.