calender_icon.png 2 February, 2026 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్

02-02-2026 09:02:07 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి.వినోదను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. విధులకు గైర్హాజరు కావడం, ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లడం, విద్యా తరగతులు ప్రారంభించకపోవడం, విద్యార్థులకు అపరిశుభ్రమైన వసతి, నాణ్యత లేని ఆహారం అందించడం వంటి ఆరోపణలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని కలెక్టర్ వెల్లడించారు.