02-02-2026 09:04:57 PM
సాహు శ్రీలత ఇంటింటా ప్రచారం
తాండూరు,(విజయక్రాంతి): వార్డు అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు ఆ పార్టీ అభ్యర్థి సాహు శ్రీలత లక్ష్మీకాంత్ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆమె కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గతంలో తాను ఇదే వార్డు నుండి కౌన్సిలర్ గా విజయం సాధించి వార్డు అభివృద్ధికి కృషి చేశానని.. వార్డులో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకునేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.