calender_icon.png 2 February, 2026 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మ బొరుసు ఆటపై టాస్క్ ఫోర్స్ దాడి

02-02-2026 08:58:47 PM

కొల్చారం,(విజయక్రాంతి): మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుంపలకుంట గ్రామంలో బొమ్మ బొరుసు ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4,054 నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాజాశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.