24 April, 2026 | 9:06 PM

రెడ్లకుంట గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత

24-04-2026 07:31 PM

సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు

కోదాడ,(విజయక్రాంతి): రెడ్లకుంట గ్రామాభివృద్ధికి తొలి ప్రాధాన్యత అని సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు అన్నారు. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ఎనిమిదో వార్డులోని బీసీ కాలనీలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తూ నూతనంగా డ్రైనేజీ నిర్మించామన్నారు. హిందూ స్మశాన వాటికకు, ఎస్సీ స్మశాన వాటికకు వెళ్లే దారుల్లో నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. గ్రామ మహిళల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఒక మహిళా బిల్డింగ్‌ను నిర్మించామన్నారు. గ్రామంలో ప్రధానమైన పెద్ద కాలువ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని, వీటిని త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.