12 May, 2026 | 4:05 AM

ఫైనల్స్‌కు పృథ్వీరాజ్, రాజేశ్వరీ

29-01-2025 11:46 PM

భోపాల్: 3వ దిగ్విజయ్ సింగ్ మెమోరియల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో షాట్‌గన్ విభాగంలో భారత షూటర్లు పృథ్వీరాజ్ తొండైమన్, రాజేశ్వరీ కుమారీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల షాట్‌గన్ ట్రాప్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో సులేమన్ అర్ష్ 121 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచాడు. పృథ్వీరాజ్ తొండైమన్ రెండో స్థానంలో, ఢిల్లీ షూటర్ ఫహ్ద్ సుల్తాన్ మూడో స్థానాల్లో నిలిచారు. ఆసియా గేమ్స్ రజత పతక విజేత లక్ష్యయ్ షెరాన్ కూడా టాప్ చోటు దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఆర్మీ షూటర్ ప్రీతి రాజక్ 119 పాయింట్లతో లీడింగ్ స్కోర్ చేయగా.. రాజేశ్వరీ కుమారీ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. నేడు షాట్‌గన్ ట్రాప్ ఈవెంట్ ఫైనల్స్ జరగనున్నాయి.