24 June, 2026 | 2:26 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలతో ఇబ్బందులు

04-05-2026 01:12 AM

కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు 

ఎల్బీనగర్, మే 3 (విజయక్రాంతి): అర్ధరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నవారిపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశా రు. వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి 2 గంట ల ప్రాంతంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్ సిబ్బంది కొత్తపేట నుంచి నాగోల్ వెళ్తూ చిత్తరమ్మ ఆలయం సమీపంలో గస్తీ తిరుగుతున్నారు.

ఇదే సమయంలో కౌశిక్ ఠాకూర్ అలియాస్ లక్కీ అనే వ్యక్తి తన స్నేహితులైన అంధోజ సాయి రామ్, దోసా ద విశాల్‌రెడ్డి, సయ్యద్ సొహిల్, అంకిత్, ఆరిఫ్, నిహాంత్, వెంకట్, యశ్వంత్ రెడ్డి, నితిన్ తోపాటు ఇతరులతో కలిసి రోడ్డు మీద అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు చేస్తూ, ప్రజలకు అసౌకర్యం కల్పిస్తు న్నారు. వెంటనే వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు.

నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి ప్రాం తంలో షాపులు నడిపిస్తున్న కొత్తపేటలోని పిజ్జా హట్, వికాస్ నగర్ లోని టిల్లు ఫార్మా పాన్ షాపులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ... రోడ్లపై అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు, పార్టీ లు, పరిమితిని మించిన సమయంలో షాపు లు నడపడం, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పబ్లిక్ న్యూసెన్స్ గా పరిగణించి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.