4 May, 2026 | 2:25 AM

నిత్యావసరం.. మరింత ప్రియం!

04-05-2026 01:13 AM
  1. కృత్రిమ కొరతతో.. ధరలకు రెక్కలు.
  2. మగ్గుతున్న మధ్యతరగతి కుటుంబాలు
  3. నెలలో 22 శాతం పెరిగిన నూనె ధర 
  4. తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలంటున్న సామాన్యులు

తుంగతుర్తి, మే 3 :  నూనె ధరల మంటలతో సామాన్యుల బడ్జెట్ తలకిందులై, పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం సాకుతో పెరిగిన ధరలు : ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో నెల రోజుల్లోనే కిలో నూనె ధర దాదాపు 22 శాతం పెరిగింది. ఈ పరిస్థితుల వల్ల వంటింటి బడ్జ్పె తీవ్ర ప్రభావం పడిందని పేద ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం, గ్రామాల పరిధిలో  వంట నూనె వంట ఇళ్లలో ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధం మంటలు అంటుకుంటున్నాయి. అక్కడి యుద్ధం ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ దెబ్బకు వంట నూనెల ధరలు మండి పోతున్నాయి. 

 నూనె ధరలు పైపైకి : 

నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరిగి సామాన్యులకు షాకిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఓ వైపు రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోగా, మరోవైపు గ్యాస్ ధర నిప్పులు కక్కుతున్నాయి. ఇవి చాలవు అన్నట్లు ఇప్పుడు వంట నూనెల ధరలు అదే దారిలో పయణిస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు బతుకీడ్చడం పెను భారంగా మారుతోంది.సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 180 నుంచి 200 పెరిగింది. పామాయిల్ ధర రూ. 120 నుంచి రూ. 145, వేరుశనగ నూనె రూ. 15 నుంచి 20కి చేరుకుంది. ఇక 5 కిలోల డబ్బా రూ. 1000 నుంచి రూ. 1150 లకు 15 కిలోల టిన్ను(హోల్సేల్) రూ.2300 నుంచి రూ.2400 వరకు పెరిగింది.

క రైస్ బ్రౌన్ నూనె ధర లీటర్ రూ. 150 నుంచి రూ. 165కు, వనస్పతి ఆయిల్ లీటర్ రూ. 130 నుంచి రూ. 160కి, సోయాబీన్స్ ఆయిల్ రూ. 150  . 1703,  3 .130 నుంచి రూ. 160 కి చేరుకుంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఓ వైపు బయట హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరుగుతుండగా మరోవైపు వంటనూనెల ధరలు ఆకాశానికి అంటుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్లో భారీగా మార్పులు వస్తున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై తనిఖీలు చేపట్టి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

 అధికారులు తనిఖీలు చేపట్టాలి 

అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల యుద్ధ ప్రభావంతో సామాన్య ప్రజలు భరించలేని విధంగా గ్యాస్ ధరలు మారాయి. దీనినీ ప్రభుత్వాలు నియంత్రించలేక పోయాయి. పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక అధికారులు తనిఖీ నిర్వహించి అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

-  మట్టి పెళ్లి. వెంకట్,  యువజన నాయకుడు అన్నారం.