30 June, 2026 | 6:12 PM

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

30-06-2026 05:38 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను బీమా కంపెనీలకు అప్పగించవద్దని, కార్మికులకు ఉపయోగం లేని సీఎస్‌సీ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ క్లెయిమ్‌లను విడుదల చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలోని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు తహశీల్దార్ షా ఖాసీంకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం అబ్దుల్ నబీ మాట్లాడుతూ 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.6 వేల పెన్షన్, సహజ మరణ బీమాను రూ.5 లక్షలకు పెంచాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.