పిహెచ్‌సిని కలెక్టర్ తనిఖీ
30-06-2026 05:36 PM
భైంసా,(విజయక్రాంతి): భైంసా డివిజన్లో లోకేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఆయన అటెండెన్స్ రిజిస్టర్ మందుల వివరాలు స్టాక్ రిజిస్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల విధులపై ఆరా తీశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ స్థానిక సిబ్బంది ఉన్నారు.






