30 June, 2026 | 6:01 PM

పీఎంశ్రీ రద్దు చేసి అంగన్వాడీలను బలోపేతం చేయాలి

30-06-2026 05:29 PM

– సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్

దమ్మపేట,(విజయక్రాంతి): అంగన్వాడి కేంద్రాలలో అందుతున్న పలు రకాల సేవలను ప్రజలకు దూరం చేయటం కోసమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పీఎం శ్రీ ని తీసుకువచ్చిందని, అంగన్వాడి కేంద్రాలను రద్దు చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వ చర్యలను ప్రజలు వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. మంగళవారం మండల వ్యాప్తంగా అంగన్వాడి సర్కిల్ మీటింగ్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా టీచర్లు హెల్పర్లు కృషి ఫలితంగా పోషకాహార లోపం తగ్గింది.

అక్షరాస్యత పెరిగిందని, రక్తహీనత, పోలియో నిర్మూలన సహా మానవ అభివృద్ధి సూచీలో మన దేశం ముందు ఉంచడంలో అంగన్వాడి కేంద్రాల పాత్రను పలు అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయని అన్నారు. కానీ ఐసిడిఎస్ కు బడ్జెట్లో కోత పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను పీఎం శ్రీ పథకానికి దారి మళ్ళించిందని, ఇప్పుడు కొత్తగా ఈ పథకంలో భాగంగా ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో ఊరికి దూరంగా ఉండటం పలు కారణాల వలన ప్రజలు ఆ పాఠశాలలకు తమ పిల్లలను పంపడం లేదని అన్నారు. పిఎం శ్రీ ని అంగన్వాడి కేంద్రాలకి అప్పగించాలని, అంగన్వాడి కేంద్రాలను బలహీనపరిచే పీఎం శ్రీ ను రుద్దయ్యేంతవరకు అంగన్వాడి ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.