calender_icon.png 8 February, 2026 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచార జాతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

08-02-2026 07:24:19 PM

సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్

సిద్దిపేట క్రైం: సంచార జాతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని  సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచార జాతుల సమగ్ర సర్వే నిర్వహించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసినట్టు చెప్పారు. సమస్యలకు పరిష్కారానికి పుస్తక రూపంలో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.  సిద్దిపేటలో సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. సంచార జాతుల జీవన ఆధారమైన కళలను ప్రోత్సహించాలని కోరారు.

వారి ఆచారాలు, సంప్రదాయాలకు భంగం కలగకుండా చూడాలన్నారు .రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7000 మందిని ప్రత్యక్షంగా కలిసి 33 సంచార జాతుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశామన్నారు . సంచారజాతుల పిల్లలకు విద్యను అందించాలని కోరారు. కులం సర్టిఫికెట్లు సులభంగా పొందేలా సరళీకృతం చేయాలన్నారు. స్వయం అభివృద్ధి సాధించేలా పథకాలు రూపొందించాలని, భూమి లేని వారికి భూములు అందించి పక్కా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ మాలే రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ జిల్లా కార్యదర్శి బాలయ్య, సంతోష్, తొగుట మండల కన్వీనర్ యాదగిరి పాల్గొన్నారు.