08-02-2026 07:21:49 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మహిళల అభివృద్ధి కోసం సంఘ బంధాలు లక్ష్యంగా పనిచేయాలని మంగాపురం గ్రామ సర్పంచ్ బత్తిని అంజయ్య గౌడ్ అన్నారు. మండలంలోని మంగాపురం గ్రామంలో ఉపాధి ఆమె పథకం కింద మంజూరైన 10 లక్షలతో నిర్మిస్తున్న సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులను ఆదివారం అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమ భావన సంఘాలలో ఉన్న మహిళలు సమావేశాలు నిర్వహించేందుకు నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ,ఏపీవో సురేష్, మాజీ ఎంపీటీసీ బాల్ దూరి సందీప్, పంచాయతీ కార్యదర్శి సుమిత్ర, ఉపసర్పంచ్ ధరావత్ భాషా, గ్రామ శాఖ అధ్యక్షుడు పేరబోయిన వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు ఎల్లావుల లింగయ్య,యలమంచయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివో ఏ శశికళ మరియు వార్డు నెంబర్లు పాల్గొన్నారు