calender_icon.png 10 February, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే ప్రగతి

10-02-2026 01:39:11 AM

  1. పరిశుభ్ర మధిరకు ప్రణాళికలు
  2. ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

ఖమ్మం, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ గెలుపుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. మధిరలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కా రానికి ఆలోచన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభు త్వం అని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తారీఖున  ఉద్యోగుల జీతాలు జమ చేస్తున్నాం అని వివరించారు.

ఉద్యోగుల సంక్షేమానికి కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తాం అని పేర్కొన్నారు. మహిళా సంఘాల కు వడ్డీ లేని రుణాలు  ఎన్ని వేల కోట్లయినా ఇస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షల వరకు పెంచామని పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్-2047 తో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యం అభివృద్ధి చెందిన దేశాలతో పో టీపడే స్థాయికి తెలంగాణ చేరిందని చెప్పారు.

ప్రజా ప్రభుత్వం వచ్చాక పట్టణాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది అని పేర్కొన్నారు. పట్టణా ల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ కృషి చేస్తున్నట్లు వివరించారు. మధిర అభివృద్ధికి రాజకీయాలు కాదు  అభివృద్ధే లక్ష్యం ఉండాలని వివరించారు.

మధిరలో వరద నీరు నివారించేం దుకు భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణా న్ని చేపడుతున్నట్లు వివరించారు. వైరా నదిని టూరి జం ప్రాజెక్టుగా అభివృద్ధి, అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్ విద్యుత్ సరఫరా పనులు చేపడుతున్నట్లు వివరించారు. మై మధిర  క్లీన్ అండ్ గ్రీన్ ఉండేలా ప్రణాళికలు రూ పొందిస్తున్నామని పేర్కొన్నారు.