నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో యువజన సమ్మేళనం
స్నేహితుల దినోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న యువత
గుండాల, (విజయక్రాంతి): ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన సమ్మేళనంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న యువత మాట్లాడుతూ..నవ చైతన్య యువజన సంఘం మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి సమస్యల పరిష్కారం కోసం విశేష కృషిని నిర్వహించిందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని, యువత ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేడు సమాజంలో యువత డ్రగ్స్, మద్యం వంటి వ్యసనాలకు బానిసలై నిండు జీవితాన్ని కోల్పోతున్నారని, అటువంటి వాటికి యువత దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సమ్మేళన కార్యక్రమంలో నవ చైతన్య యువజన సంఘం సభ్యులు, పాత్రికేయ మిత్రులు, పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.






