3 August, 2026 | 10:12 AM

ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎర్ర అనుదీప్ కుమార్

03-08-2026 09:07 AM

తుంగతుర్తి( విజయ క్రాంతి): ఐఎన్టియుసి తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులుగా ఎర్ర అన్నదీప్ కుమార్ ను నియమిస్తూ ఆదివారం నియామక పత్రం అందజేశారు .ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి సూచనలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న ఆదేశాల మేరకు మండల కమిటీలు ఏర్పాటు చేసి నియోజకవర్గ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని ,ఆలకుంట్ల బాలకృష్ణ  తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్ర అనుదీప్ కుమార్ మాట్లాడుతూ నాకు ఈ బాధ్యత ఇచ్చిన ఐఎన్టియుసి జిల్లా నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.మండలంలోని కార్మికుల సమస్యల పట్ల పోరాడుతానని ఐఎన్టీయూసీ బలోపేతానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పిలుపుమేరకు నియమ నిబద్ధతతో కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చుక్కయ్య గౌడ్ సూర్యాపేట జిల్లా సెక్రెటరీ బూరుగుల వెంకన్న జిల్లా సోషల్ మీడియా శివరాత్రి గోపి,  జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.