calender_icon.png 10 February, 2026 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీపోస్టుమార్టం ఎందుకు చేస్తలేరు

10-02-2026 01:25:18 AM

  1. కర్ల రాజేష్ లాకప్‌డెత్ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి మౌనం సరికాదు 
  2. గతంలో మరియమ్మ లాకప్‌డెత్‌పై కేసీఆర్ వెంటనే స్పందించారు 
  3. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : పోలీసుల చిత్రహింసల వల్ల ప్రా ణాలు కోల్పోయిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయడానికి పోలీసు శాఖ ఎందుకు జంకుతోం దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. రీపోస్టుమార్టం చేయాలని తాము ఫిర్యాదు చేయ డంతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా డీజీపీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు.

ఫిబ్రవరి 28న చలో సూర్యాపేట పేరుతో ప్రజా ఆగ్రహ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి పోలీసులే కార ణమని తాము దాదాపుగా 90 రోజుల నుం చి మాట్లాడుతున్నా.. పోలీసు శాఖ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ‘మా వాదన తప్పయితే కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కదా?’ అని కృష్ణ మాదిగ నిలదీశారు.

రాజేష్ మరణానికి పోలీసులే కారణమని రుజువు చేయడానికి ఆధారాలున్నాయని, అందుకే రీపోస్టుమార్టం చేయడా నికి పోలీసులు ముందుకు రావడం లేదని  కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. తక్షణమే సూర్యాపేట ఎస్పీని బదిలీ చేయాలని, ఆయ న అక్కడుంటే కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తారని తెలిపారు. దోషులకు శిక్షపడే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

గతంలో జరిగిన మరియమ్మ లాకప్‌డెత్‌లో ఆనాటి సీఎం కేసీఆర్ దళితుల మీద చేయివేస్తే ఊరుకోమని పోలీసులను హెచ్చరిం చడంతో పాటు వెంటనే కానిస్టేబుల్‌ను డిస్మి స్ చేశారని కృష్ణ మాదిగ గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇళ్లు ఇచ్చి 10 రోజుల్లోనే సమస్య పరిష్కారకం చేశారని తెలిపారు.

రాజేష్ లాకప్‌డెత్ విషయంలో మూడు నెలలు కావస్తున్న  సీఎం రేవంత్‌రెడ్డి కనీసం నోరు కూడా మెదపడంలేదని విమర్శించారు. హోంశాఖ తన వద్దే ఉన్నప్పటికి రేవంత్‌రెడ్డి మౌనంగా ఉండటం దారు ణమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, హైకో ర్టు అడ్వకేట్ దున్న అంబేద్కర్, ఎమ్మార్పీఎస్ నాయకులు టీవీ నరసింహ, మల్లికార్జున్, శ్రీకిషన్, మహేష్, ఆదిత్య తదితరులు ఉన్నారు.