ప్రముఖ రచయిత్రి స్వర్ణ కిలారికి గూడూరి సీతారాం పురస్కారం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రముఖ రచయిత్రి స్వర్ణ కిలారికి గూడూరి సీతారాం పురస్కారాన్ని అందిస్తున్నట్లు మానేరు రచయితల సంఘం కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, గూడూరి ఫౌండేషన్ ఎలగొండ రవిలు తెలిపారు. మారసం అధ్యక్షులు, ప్రసిద్ధ తెలంగాణ కథా రచయిత గూడూరి సీతారాం యాదిలో గూడూరి ఫౌండేషన్ - మారసం కథా పురస్కారం నెలకొల్పిన విషయం తెలిసిందే. 2024 పురస్కారానికి రచయిత్రి, అనువాదకులు స్వర్ణ కిలారి "నల్ల బంగారం" కథల పుస్తకం ఎంపికయ్యింది.
ఏప్రిల్ 5, 2026 ఆదివారం రోజున డా సినారే విజ్ఞాన మందిరం, జిల్లా గ్రంథాలయంలో జరిగే సభలో పురస్కారం ప్రదానం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, డా.నలిమేల భాస్కర్, జుకంటి జగన్నాథం లు పాల్గొంటారన్నారు. గెంట్యాల భూమేష్ సభకు అధ్యక్షత వహించగా గూడూరి సీతారాం కుమారులు గూడూరి వేణు, మారసం వ్యవస్థాపకులు డా పత్తిపాక మోహన్ లు పాల్గొంటారు. తెలంగాణ జీవితాలు, బొగ్గు బాయి బతుకులను స్వర్ణ కిలారి "నల్లబంగారం" కథలుగా వ్రాశారు. గతంలో ఈ పురస్కారాలు వరుసగా పూడూరి రాజిరెడ్డి, డా సూర్య ధనంజయ్, పిన్నమశెట్టి కిషన్ లు అందుకున్నట్లు వివరించారు.




