16 July, 2026 | 12:11 PM

ముదిరాజ్‌లకిచ్చిన హామీలను నెరవేర్చాలి

04-07-2024 12:55 AM
  • ముదిరాజ్ మహాసభ డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తన అభయ హస్తం మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుర్రాల మల్లేశం ముదిరాజ్ కోరారు. బుధ వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్, ముత్తరాసిలను బీసీP డీ నుంచి బీసీ  చేర్చాలని డిమాండ్‌చేశారు.

ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ మత్స్య కో ఆపరేటివ్ ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహించి పాలకమండలిని నియమించాలని పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజికవ ర్గానికి చెందిన వారినే చైర్మన్‌గా నియమిచాలని విజ్ఞప్తిచేశారు. గీత, చేనేత కార్మికులకు ఇస్తున్న విధంగా ముదిరాజ్ మత్స్యకారులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

కోకాపేటలో నిర్మాణంలో ఉన్న ముదిరాజ్ ఆత్మగౌరవ భవన్‌కు  రూ.10 కోట్ల నిధులు మంజూ రు చేయాలని కోరారు. సమావేశంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  పండుగ బాలు ముదిరాజ్, బాల్ సత్తయ్య, యాదగిరి, కార్పొరేటర్ కృపాసాగర్, డమ్మిగారి కనకయ్య, బొక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.