calender_icon.png 12 August, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటి సంరక్షించండి

04-12-2024 04:39:37 PM

మొక్కలను పెంచడం అలవాటుగా చేసుకోండి 

ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రక్షించాల్సిన బాధ్యత అలవాటుగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మూఢ కార్యాలయం పరిధిలో మొక్కలను నాటి ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్క మీకు జ్ఞాపకంగా చిరస్మరణీయంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఇప్పుడు నాటిన మొక్క ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రకృతి పచ్చగా ఉన్నప్పుడే మనిషి జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు. మనిషి ఆరోగ్యానికి వృక్షాలు ఎంతో వెన్నుదన్నుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ముడా కార్యాలయ అధికారులు తదితరులు ఉన్నారు.