12 March, 2026 | 4:09 AM

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 1.5 కోట్లు మాయం

12-03-2026 02:11 AM
  1. దుబాయ్ కాల్ సెంటర్ల లింకుతో దందా
  2. హైదరాబాద్‌లో నలుగురు నిందితుల అరెస్ట్
  3. పరారీలో ప్రధాన సూత్రధారి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): తక్కువ పెట్టుబడితో కూర్చున్న చోటే లక్షల రూపాయల లాభాలు సంపాదించవచ్చనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల మాయలో పడి ఒక వ్యక్తి ఏకంగా రూ.1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి 2025లో బెట్టింగ్ ఎక్సెంజ్ అనే వ్బుసైట్ ప్రతినిధులమని చెప్పుకుంటూ వాట్సాప్ సందేశా లు వచ్చాయి. క్రికెట్ బెట్టింగ్, తీన్ పట్టి, క్యాసి నో వంటి ఆటల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.20,001 డి పాజిట్ చేయగా రూ.5 వేల లాభం రావడంతో బాధితుడు నిజమేనని నమ్మాడు.

ఆ తర్వాత మోసగాళ్ల ప్రోద్బలంతో తన భార్య ఖాతా నుం డి కూడా డబ్బులు మళ్లించాడు. 2025 నుంచి 2026 మధ్య వివిధ విడతలుగా సుమారు రూ.1.5 కోట్లు చెల్లించాడు. బాధితుడు డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, వ్బుసైట్ డొమైన్లు మారుస్తూ అదనపు ఛార్జీల పేరిట మరింత వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతర్జాతీయ నెట్వర్క్‌తో సంబంధం ఉన్న ఈ ఘరానా మోసాన్ని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ సయీద్ ఉద్దీన్ గతంలో దుబాయిలోని క్రికెట్ బెట్టింగ్ కాల్ సెంటర్‌లో పనిచేశాడు. ఇండియాకు వచ్చిన తర్వాత, దు బాయిలో ఉన్న ముదస్సిర్ అనే వ్యక్తికి మన దేశ సిమ్ కార్డులు పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన అనుచరులైన మహమ్మద్ తాజుద్దీన్, యూనస్, అయూబ్ ల ద్వారా వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో సుమా రు 250 సిమ్ కార్డులను సేకరించాడు.

ఒక్కో కార్డుకు స్థానికంగా రూ.600 ఇస్తానని ఆశ చూపి, వాటిని దుబాయికి పంపి ఒక్కోదానికి రూ.1200 వసూలు చేశాడు. ఈ సిమ్ కార్డులను వాడే నిందితులు విదేశాల్లో ఉండి ప్రజల ను బురిడీ కొట్టిస్తున్నారు. డిసిపి వి. అరవింద్ బాబు ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ పి. శివ చంద్ర నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. కేవలం కమీషన్ల కోసం నేరగాళ్లకు సహకరించి జైలు పాలయ్యారని పోలీసులు తెలిపారు.