15 March, 2026 | 7:27 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

నల్ల బ్యాడ్జీలతో నిరసన

29-03-2025 01:25 AM

కాటారం, మార్చి 28 (విజయక్రాంతి) : వక్ఫ్ సవరణ బిల్లు 2024 కి నిరసనగా రంజాన్ చివరి శుక్రవారం అల్విదా జుమా నాడు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు చేతికి నల్లటి బ్యాండ్లు, బ్యాడ్జీలు ధరించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్బి) ఇచ్చిన పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం మస్జిద్ కు  నల్లటి బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా గారేపల్లి మస్జిద్ అధ్యక్షులు  షేక్ అమీర్ మాట్లాడుతూ .. ఈ బిల్లు ముస్లింల మసీదులు, ఈద్గాలు, మదర్సాలు, దర్గాలు, ఖాన్ఖాలు, స్మశానవాటికలు, ధార్మిక సంస్థలను లాక్కునేందుకు ఉద్దేశించిన కపటకుట్రగా పేర్కొన్నారు. ఈ బిల్లుని వ్యతిరేకించడం దేశంలోని ప్రతి ముస్లిం బాధ్యత అని అన్నారు. జుముఅతుల్ విదా ఉన్నందున మసీదుకు వచ్చే సమయంలో ముస్లిం లందరూ  నల్లటి బ్యాండ్ ధరించి శాంతియుతంగా , మౌనంగా నిరసన తెలపడం జరిగిందన్నారు. మత పెద్దలు ,ముస్లిం సోదరులు, యువత  పాల్గొన్నారు.