లేబర్ కోడ్ల రద్దు కోసం నల్ల బ్యాడ్జిలతో నిరసన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా, బెల్లంపల్లి సింగరేణి సివిక్ విభాగంలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చేశారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీ యూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడారు.కార్మిక వర్గం పోరాడి రక్త తర్పణ చేసి తెచ్చుకున్న 29 కార్మిక చట్టాలు, కార్పొరేట్లకు అనుకూలంగా మార్చారని విమర్శించారు.
4, లేబర్ కోడ్ లు గా కుదించి దేశంలోని కార్మిక వర్గాన్ని కార్పొరేట్ కాళ్ల కింద బానిసలుగా మార్చే లేబర్ కోడ్ ల ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు కోసం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలే కాకుండా, లెక్కకు మిక్కిలి ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కార్మిక వర్గానికి కంటకంగా ఉరితాలుగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేస్తూ తమ ప్రభుత్వాలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేశాయనీ తెలిపారు.
అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కార్మిక వర్గం హక్కులను హరించడానికి పూనుకున్నదనీ ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి అమలుకు ఆదేశాలిచ్చి కార్పొరేట్లకు తన స్వామి భక్తిని చాటుకున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో PDSU, నాయకులు చరణ్,IFTU, రీజియన్ నాయకులు ఎం కృష్ణవేణి, గోొడిసెల. వెంకటి, కొమరయ్య, శ్యామ్, చంద్రకళ, పద్మ, కన్నడ, దేవమ్మ, భాను ప్రకాష్, గణేష్, కరుణ, లక్ష్మి, శ్రీనివాస్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.




