10 April, 2026 | 2:31 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

నేపాల్‌లో 105 మంది ఆందోళనకారుల అరెస్ట్

30-03-2025 12:21 AM

రాచరిక పాలన కోసం మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతుదారుల డిమాండ్..

రాళ్లదాడి, పలు వాహనాలకు నిప్పు..

అల్లర్లలో ఇద్దరు మృతి.. 112 మందికి గాయాలు..

న్యూఢిల్లీ: నేపాల్‌లో తిరిగి రాచరిక పాలనను ప్రవేశపెట్టాలంటూ ఆందోళనలు చేసిన 105 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితి అదుపులోకి రావడంతో శుక్రవారం ఖాట్మాండులోని పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను ఎత్తేశారు. కాగా నేపాల్‌లో తిరిగి రాచరిక పాలనను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతు దారులు దేశ రాజధానిలో ఆందోళనలు చేశారు. రాళ్లు రువ్వడంతో పాటు రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టి, వ్యాపార సముదాయాల్లో చొరపడి దొపిడికి పాల్పడ్డారు. నిరసనకారులు జరిపిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా సుమారు 112 మంది గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు శుక్రవారం సాయంత్రం నగరంలో కర్ఫ్యూ విధించారు. శనివారం ఉదయం నాటికి పరిస్థితి అదుపులోకి రావడంతో కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.