10 April, 2026 | 4:10 PM

Breaking News

ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •   నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహుకరణ   •   రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం   •   అభివృద్ధి పథంలో భాగ్యనగర్ తండ గ్రామపంచాయతీ   •   టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •  

నేడు నాగ్‌పూర్‌కు ప్రధాని

30-03-2025 12:19 AM

ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళి అర్పించనున్న మోదీ..

మహదేవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన..

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం నాగ్‌పూర్‌కు వెళ్లనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులైన కేజీ హెడ్‌గేశ్వర్, ఎం.ఎస్ గోల్వాల్కర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ స్మృతి మందిరంలో మోదీ నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హెడ్‌గేశ్వర్ ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కాగా.. ఎం.ఎస్ గోల్వాకర్ ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండో సారంగ్‌సంచాలక్‌గా సేవలందించారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ హెడ్‌గేశ్వర్ స్మృతి మందిర్‌లో ప్రధాని నివాళి అర్పిస్తారు. 1956లో వేల మంది అనుచరులతో అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన దీక్ష భూమి వద్ద ప్రధాని మోదీ అంబేద్కర్‌కు నివాళి అర్పించనున్నారు. 

మహదేవ్ నేత్రాలయకు శంకుస్థాపన

ఈ పర్యటనలో ప్రధాని మోదీ మహదేవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రిలో 250 పడకలు, 14 అవుట్ పేషంట్ డిపార్ట్‌మెంట్లు (ఓపీడీ), 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి.