విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, మార్చి 8 (విజయక్రాంతి): విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జిల్లాలోని రఘునాథపల్లి మండల పరిధిలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నం విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో వంటశాలను సందర్శించి, భోజనం తయారీ విధానం, నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని తనిఖీ చేసి మెనూ ప్రకారం అందిస్తున్నారా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు.
అలాగే ప్రతి ఒక్కరి హాజరు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పది విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవుతున్నారు? అని ఆరా తీశారు. విద్యార్థులు సమయానికి తిని, సరిగా నిద్ర పోవాలని, క్రమశిక్షణతో చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ పర్యవేక్షణలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీలత, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




