calender_icon.png 20 February, 2026 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం

20-02-2026 01:26:35 AM

మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి 

నిర్మల్, ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి): ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి అన్నారు. పట్టణంలోని శాంతినగర్ కాలనీ గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మున్సఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు.

వార్డ్ కౌన్సిలర్ సుమలత ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగేనిర్మల్ జిల్లా కేం ద్రంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు.

మంచిర్యాల చౌరస్తా వద్ద శివాజీ విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు రాజు, గోపి, శ్రీనివాస్, హరీష్, నరేందర్ పాల్గొన్నారు.