calender_icon.png 20 February, 2026 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీం వర్క్ భేష్

20-02-2026 01:26:06 AM

రాష్ట్ర నేతలతో రాహుల్, ఖర్గే

  1. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పార్టీ అగ్రనేతలు హర్షం 
  2. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాన్సెప్ట్ బాగుంది 
  3. తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవాలి 
  4. పార్టీ నేతలకు రాహుల్‌గాంధీ దిశానిర్దేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వ పాలన బాగుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కితాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై పార్టీ అగ్రనేతలు అభినందనలు తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు కాన్సెప్ట్ బాగుందన్నారు. పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌గాంధీతో గురువారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, సీత క్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వివేక్ సమావేశమయ్యా రు.

సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చే స్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలపైన చర్చ జరిగింది. వీటితో పాటు నైనీ బ్లాక్ టెండర్ల అంశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంతో పాటు నామినేటెడ్ పదవులపైన కూడా చర్చించి నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలను సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అగ్రనేతలకు వివరించారు.

సీఎం నా యకత్వంలో సమష్టిగా పని చేసి మంచి ఫలితాలు సాధించామని, భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో పని చేస్తామని పార్టీ అగ్రనేతలకు మంత్రులు కూడా వివరించినట్లుగా తెలిసింది. తాము నిర్వహిస్తున్న శాఖల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నారని మంత్రులు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అంశాలు, శాఖల వారీగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తు న్న పథకాలతో పాటు వరి ధాన్యం సాగు, కొనుగోలుకు సంబంధించిన విషయాలపైనా రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆరా తీసినట్లు తెలిసింది.

టీమ్ వర్క్ మరింత పెరగాల్సిన అవసరం, పార్టీని మరింత బలోపేతం చేయాలని రాహుల్, ఖర్గే అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచలోనే నంబర్ వన్‌గా నిలవాలని రాహుల్‌గాంధీ ఆకాంక్షించారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతు సంక్షేమం విషయంలో రాజీపడొద్దని పార్టీ ఆగ్రనేతలు సూచించారు. 

నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి రెండేళ్లయినా.. నామినేటెడ్ పోస్టులను పూర్తిగా భర్తీ చేయకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందనే విషయం చర్చకు వచ్చినట్లు గా తెలిసింది. ఇంకా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేయాలని రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ పెద్దలు సూచిం చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని, కేడర్ పనిచేయడం వల్లే అధికారంలోకి వచ్చామనే విషమయం మర్చిపోవద్దని సూచించారు. ఇక రాష్ట్రంలో ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ ఎంపీల ఖాళీల భర్తీపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఇతర పార్టీ పెద్దలతో సమావేశమై నిర్ణ యం తీసుకుంటామని రాహుల్‌గాంధీ, ఖర్గే చెప్పినట్లుగా తెలిసింది. 

హామీలు అమలు చేస్తున్నాం : ఎక్స్‌వేదికగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే 

తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా  స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజ యం సాధించిందని,  తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పిలిచి మాట్లాడుతాం 

పార్టీ అగ్రనేతలతో జరిగిన ఈ కీలక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరుపై ఈ భేటీలో లోతైన సమీక్ష చేశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజ్యసభ స్థా నాలకు అభ్యర్థుల భర్తీ, నైనీ బొగ్గు గనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన అంశం తెలిసిందే.

మంత్రి పదవి ఇస్తామన్న హామీని పార్టీ అధిష్ఠానం అమలు చేయడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మె ల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డిని తాము పిలిచి మాట్లాడుతామని పార్టీ అగ్రనేతలు చెప్పినట్లుగా సమాచారం. ఇక నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై పార్టీ నేతలు ఆరా తీయగా, సింగరేణి నిబంధనలకు లోబడే టెండర్లు ఆహ్వా నించామని, టెండర్లపై ఆరోపణలు రావడంతో, వెంటనే వాటిని రద్దు చేశామని సీఎం రేవంత్‌రె డ్డి, డిప్యూటీ సీఎం భట్టి వివరించినట్లు తెలిసింది. 

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ : పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

వచ్చే మూడు సంవత్సరాల తర్వాత కూడా రాష్ర్టంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహాష్ కుమార్ గౌడ్ అన్నారు. వచ్చే మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టు లు భర్తీ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ, ఖర్గేతో జరిగిన సమావేశంలో పార్టీ నిర్మాణం, తెలంగాణలో అమ లు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించినట్లు తెలిపారు

 ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్‌గాంధీ అభినందించారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లను మెచ్చే  మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం ప్రజ లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మహేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల విధివిధానాల గురించి రాహుల్ గాంధీ తెలుసుకుని అభినందించారని తెలిపారు.