1 April, 2026 | 6:03 AM

బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం వృథా: మంత్రి జూపల్లి

18-02-2025 05:47 PM

హైదరాబాద్: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి మండిపడ్డారు. నగరంలోని సీఎల్పీ కార్యాలయం(CLP Office)లో మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) 10 ఏళ్లలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుకు నెలకు రూ. 6500 కోట్ల వడ్డీలు కడుతున్నామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొన్నానని మంత్రి జూపల్లి తెలిపారు.

గతంలో బీఆర్ఎస్ చెప్పిన హామీలు నిరుద్యోగ భృతి, దళితులకు భూమి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల అవినీతిపై తాను సవాల్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని, కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao) చెప్పిన వారికే టెండర్లు ఇచ్చారని దాని గురించి సవాల్ చేస్తే స్పందించలేదని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం వృథా అయిందని మంత్రి జూపల్లి స్పష్ట చేశారు.