15 June, 2026 | 8:15 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ప్రజాపాలనకు ప్రజామోదం

14-02-2026 01:48 AM

అభివద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తోందని, కాంగ్రెస్ ప్రజాపాలనకు ప్రజామోదం లభించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్నబియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారిందని ఆయన చెప్పారు.

పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించినట్లైందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ వట్టి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచిత బస్‌ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన నిరుపేద మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పథకాలు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయని స్పష్టం చేశారు.

సాగునీటి రంగంలో సాధించిన విజయాలు, యావత్ భారతదేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు, అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పాటు రైతాంగానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని వెల్లడించారు.

పురపాలక సంఘం ఎన్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవేనని, యావత్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయని తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్‌నగర్, నేరేడుచర్లతో పాటు కోదాడ, సూర్యాపేట పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోమారు రుజువైనందని స్పష్టం చేశారు.

ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సాధించిందని, అందుకు తోడ్పాటునందించిన ఆయా పురపాలక సంఘాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయాల వరవడి ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జరిగిన పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు మరోసారి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని నిరూపించారని పేర్కొన్నారు.