పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం
28-06-2026 01:35 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో (0-5)సం ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది చుక్కలు వేయగా, తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






