27 August, 2026 | 9:08 PM

హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. హరీశ్ రావు అరెస్ట్

27-08-2026 02:09 PM

హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ కలెక్టరేట్(Hanumakonda Collectorate) వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి హరీశ్ రావును(Harish Rao arrested) పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ రావు టీఎన్జీవోల ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. టీఎన్జీవోల ధర్నాలోపాల్గొన్న హరీశ్ రావు ను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. హరీశ్ రావును అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. హరీశ్ రావును సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.