27 August, 2026 | 2:45 PM

ఆర్టీసీ డిపో ఉద్యోగులకు రాఖీ కట్టిన ఆదిత్య స్కూల్ విద్యార్థులు

27-08-2026 02:11 PM

బాన్సువాడ, ఆగస్టు 27 (విజయ క్రాంతి): రక్షాబంధన్ పండుగ సందర్భంగా బాన్సువాడ ఆర్టీసీ డిపో ఉద్యోగుల(RTC depot employees)కు ఆదిత్య స్కూల్ విద్యార్థులు గురువారం ఆత్మీయంగా రాఖీలు కట్టారు. పండగ రోజున కూడా ఆర్టీసీ ఉద్యోగులకు విధులు ఉండటంతో కుటుంబ సభ్యులతో రాఖీ పండుగను జరుపుకునేందుకు సమయం దొరకని పరిస్థితిని గుర్తించిన ఆదిత్య స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆర్టీసీ ఉద్యోగులను అన్నదమ్ములుగా భావించి విద్యార్థులు రాఖీలు కట్టి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు(RTC depot employees) విద్యార్థుల ఆప్యాయతకు సంతోషం వ్యక్తం చేశారు. మంచి ఆలోచనతో తమ వద్దకు వచ్చి రాఖీలు కట్టిన ఆదిత్య స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు బాన్సువాడ ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా ఉద్యోగుల సేవలను గుర్తించి విద్యార్థులు చూపిన అభిమానం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.