పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ బుర్హాన్ హతం
- పీవోకేలో మట్టుపెట్టిన గుర్తుతెలియని ముఠా
- పైచదువుల పేరుతో 2017లో పాకిస్థాన్‌కు నిందితుడు
- అల్‌బదర్ ఉగ్రవాద సంస్థలో చేరిక.. కశ్మీర్ యువతకు బ్రెయిన్‌వాష్
- 2019లో పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు సరఫరా
- భారత నిఘా వర్గాలు గాలిస్తుండగా ఓ ముఠా చేతిలో హత్య
ఇస్లామాబాద్, మే 21: పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ అర్జుమంద్ గుల్జార్‌దార్ అలియాస్ హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోఓ)లో బుర్హాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మట్టుపెట్టారు. బుర్హాన్‌కు 2019 నాటి పుల్వామా ముష్కరుల దాడి వెనుక బుర్హాన్ హస్తం ఉందని భారతీయ నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చా యి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి త్వ శాఖ కూడా 2022లో బుర్హాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.
జమ్మూకశ్మీర్‌లోని పు ల్వామాలోని రత్నిపోరా ప్రాంతానికి చెందిన బుర్హాన్ ఉన్నత చదువుల పేరుతో ౨౦౧౭లో పాకిస్థాన్ చేరుకున్నాడు. ఉగ్రవాద మూకలతో సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఈక్ర మంలో అల్-బదర్ అనే నిషేధిత ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఒక సాధారణ వ్యక్తిగా అల్‌బదర్ సంస్థలో చేరిన బుర్హాన్ అనతికాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు.
ఆ తర్వాత కశ్మీర్‌కు తిరిగి వచ్చి యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వ్యూహాలు అమలు చేశాడు. అలా దక్షిణ కశ్మీర్‌లోని పు ల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. వందలాది మంది యు వకులు అతని అనుచరులుగా మారారు.
పుల్వామా దాడిలో పాత్ర
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ‘జైష్ ఏ -మహమ్మద్’కు చెందిన ఉగ్రవాది పేలుడు పదార్థాలతో కూడిన కారును సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌కి ఢీకొట్టాడు. పేలుడులో 40 మం ది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు బుర్హాన్ పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు సరఫరా చేసినట్లు భారత నిఘా వర్గాలు విచారణలో గుర్తించాయి. 2020 నవంబర్ 18న కశ్మీర్‌లో జరిగిన మరో గ్రెనేడ్ దాడితోనూ బుర్హాన్ ప్రమేయం బయటపడింది.
అప్పటి నుంచి భారత భద్రతా దళాలు, నిఘావర్గాలు బుర్హాన్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బుర్హాన్ పీవోకేకు పరారయ్యాడు. గడిచిన తొమ్మిదేళ్లలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్ర వాద దాడులతో బుర్హాన్‌కు ప్రమేయం ఉన్న ట్లు భారత నిఘావర్గాలు నిర్ధారణకు వచ్చి, గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్న సమయంలోనే గుర్తుతెలియన ముఠా అతడిని హతమార్చింది.






