28 June, 2026 | 12:40 AM

ఆర్థిక సంస్కరణల్లో మేటి పీవీ

28-06-2026 12:00 AM

నేడు పీవీ జయంతి :

* ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. అంతేకాదు.. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ మార్కెట్‌కూ అనుసంధానమైంది. 1992లో కంప్యూటర్ ఆధారిత వ్యాపార పద్ధతి కలిగిన నేషనల్ స్టాక్ ఎక్సేంజ్’ ఆవిర్భావానికి ఆయన ఆర్థిక సంస్కరణలే కారణమయ్యాయి. అంతర్గత భద్రత విషయంలోనూ పీవీ ఎన్నడూ రాజీ పడలేదు.

పంజాబ్‌లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న తీవ్రవాదాన్ని అణచివేసి, అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించారు. కశ్మీర్ తీవ్రవాదులు కొందరు ప్రముఖులను అపహరించి దేశాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలని చూసినప్పుడు, వారి డిమాండ్లను ఏమాత్రం లెక్కచేయకుండా, పీవీ వ్యూహాత్మకంగా బందీలను విడిపించిన నేర్పరి ఆయన. 

భారతదేశ రాజకీయ యవనికపై అరుదైన మేధావిగా, బహుభాషా కోవిదుడిగా, అపర చాణక్యుడిగా తన ముద్ర వేసిన పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ) కేవలం ఒక రాజకీయ నేత మాత్రమే కాదు, ఆధునిక భార తదేశ చరిత్రను మలుపుతిప్పిన యుగపురుషుడు.  ఆయన 1921 జూన్ 28న అప్ప టి నిజాం సంస్థాన పరిధిలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేవరంలో జన్మించారు. న్యాయశాస్త్ర పారంగతుడైన పీవీ, విద్యార్థి దశలోనే నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున కూడా నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలోనే ఉన్నారు. యువకుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు అన్యాయాన్ని ఎదిరించే గుణం ఉండేది. ఆ తర్వాత కాలంలో దేశాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించే రక్షకుడిగా మారతారని బహుశా ఆనాడు ఎవ రూ ఊహించి ఉండరు.

పీవీ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సంగీతం, సినిమా, నాటకాల పట్ల విశేషమైన అభిరుచి కలిగి ఉండేవారు. భారతీయ ఫిలా సఫీ, సంస్కృతిపై ఆయనకు అపారమైన పట్టు ఉండేది. తెలుగు, హిందీలో కవితలు రాయడమే కాకుండా, వివిధ పత్రికల్లో అనేక కలం పేర్లతో అనేక వైవిధ్యభరితమై న వ్యాసాలు రాస్తూ తన సాహిత్య వ్యాసంగాన్నీ కొనసాగించారు. .

దౌత్యనీతి అమోఘం

పీవీ దౌత్య నీతి విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో ప్రపంచ దేశాలకు పరిచయమైంది. అంతర్జాతీయ దౌత్యానికి సం బంధించి తన మేధావితనాన్ని, ప్రజ్ఞాపాటవాలను, దీర్ఘకాలిక రాజకీయ అనుభవాన్ని సమయోచితంగా ప్రదర్శిస్తూ భారతదేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగురవేశారు. 1980 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) మూడో సదస్సుకు నరసింహారావు అధ్యక్షత వహించి విజయవంతం చేశారు.

అదే ఏడాది మార్చిలో న్యూయార్క్‌లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్- 77’ దేశాల సమావేశానికి కూడా ఆయనే అధ్యక్ష బాధ్యతలు వహించడం విశేషం. 1981 ఫిబ్రవరిలో జరిగిన అలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో అంతర్జాతీయ సంక్షోభాల పరి ష్కారానికి ఆయన ప్రతిపాదించిన వ్యూహా లు ప్రశంసలు అందుకున్నాయి. ఇరాన్-- ఇరాక్ (గ ల్ఫ్) యుద్ధం తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో, అలీనోద్యమం తన 7వ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వాలని భారత్‌ను కోరింది.

దీనివల్ల అలీనోద్యమ అధ్యక్ష స్థా నాన్ని భారత్ అలంకరించగా, అప్పటి ప్ర ధాని ఇందిరాగాంధీ ఆ ఉద్యమానికి చైర్‌పర్సన్ అయ్యారు. ఆ సమయంలో తెరవెనుక ఉండి న్యూఢిల్లీ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహించడంతో పాటు, 1982లో అమెరికాలో జరిగిన అలీన దేశా ల విదేశాంగ మంత్రుల ప్రత్యేక సమావేశాలకు పీవీ అధ్యక్షత వహించి తన దౌత్య చాణక్యాన్ని నిరూపించుకున్నారు.

అనేక మంత్రిత్వశాఖల నిర్వహణ

పీవీ రాజకీయ ప్రస్థానం అత్యంత క్రమశిక్షణతో సాగింది. తద్వారా ఆయన ఒక్కో మెట్టు ఎదిగిన తీరు అద్భుతం. 1957లో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి తదుపరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సష్టించారు. 1962లో మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

1962 నుంచి 1964 వరకు న్యాయ, సమాచార శాఖలను, 1964 నుంచి 1967 వరకు దేవాదాయ, న్యాయ శాఖ, 1967లో వై ద్యారోగ్య శాఖ, తిరిగి 1968 నుంచి 1971 వరకు న్యాయ, సమాచార శాఖలను సమర్థంగా నిర్వహించారు. ఈ అనుభవంతో ఆయన 1971 సెప్టెంబర్ నుంచి 1973 జ నవరి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ముఖ్యమంత్రిగా ఆయన కాలం పూలబాట ఏమీ కాదు.. ఎన్నో రాజకీయ ఒడి దుడుకులను, అసమ్మతి జ్వాలలను ఆయ న ఎదుర్కొన్నారు.

పీఠం అధిష్ఠించగానే సొంత పార్టీలోనే అసమ్మతి మొదలైంది. ఈ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, ఆయన నిత్యం ఢిల్లీ పెద్దలతో భేటీ కావాల్సి వచ్చేది. దీంతో ఆయన సమయమంతా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకే సమ యం సరిపోయేది. అయినప్పటికీ, ఆయన వెరవలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లారు. 

క్లిష్ట పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్

1991లో రాజీవ్ గాంధీ దారుణ హత్య కు గురైన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా, పీవీ రాజకీయ సన్యాసం తీసుకుందామనుకున్నారు. కానీ, అనుకోకుండా ఆయనే ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది.కాంగ్రెస్‌కు పూర్తి సంఖ్యాబలం లేకపోయినప్పటి కీ, మైనారిటీ ప్రభుత్వంగా ఉన్నప్పటికీ పీవీ చాకచక్యంతో ఐదేళ్ల పూర్తి కాలంపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించారు.

ఆయన సమయంలో పీవీ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాతి పరిణా మాల్లో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. బంగారం నిల్వలను విదేశాల లో తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో  ఆర్థికవేత్త మన్మోహన్ సిం గ్‌ను పీవీ తన వద్దకు పిలిపించుకున్నారు. అనేక సార్లు భేటీ అయి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు వ్యూహాలు ర చించారు. అలా వచ్చినవే.. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు.

ఈ విధానాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ గా డిలో పడింది. అంతేకాదు.. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ మార్కెట్‌కూ అనుసంధానమైంది. 1992లో కంప్యూటర్ ఆధారిత వ్యాపార పద్ధతి కలిగిన స్టాక్ ఎ క్సేంజ్’ ఆవిర్భావానికి ఆయన ఆర్థిక సం స్కరణలే కారణమయ్యాయి. అంతర్గత భ ద్రత విషయంలోనూ పీవీ ఎన్నడూ రాజీ పడలేదు.

పంజాబ్‌లో వేళ్లూనుకున్న తీవ్రవాదాన్ని అణచివేసి, అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించారు. కశ్మీర్ తీవ్రవాదులు కొందరు ప్రముఖులను అపహరించి దేశాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలని చూసినప్పుడు, వారి డి మాండ్లను ఏమాత్రం లెక్కచేయకుండా, పీవీ వ్యూహాత్మకంగా బందీలను విడిపించిన నేర్పరి ఆయన. 

సాహిత్యకారుడు కూడా

పీవీ కేవలం రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు, 17 భాషల్లో అలవోకగా మాట్లాడగలిగిన అసాధారణ బహుభాషా పండితు డు. మాతృభాష తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, పర్షియన్ వంటి ఎన్నో భాషలపై ఆయనకు అద్భుతమైన పట్టు ఉండేది. 1940వ దశకంలోనే పీవీ తన సోదరులతో కలిసి కాకతీయ పత్రికలో ఎన్నో విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన ఘనత ఆయనది. 1948 నుంచి 1951 వరకు ఆయన ఆ పత్రికకు సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు.

తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు సైతం అమూల్యమైనది. సుప్రసిద్ధ కవి విశ్వనాథ సత్యనారాయణ రాసిన కాలాతీత నవల ‘వేయి పడగలు’ను ఆయన అత్యంత ప్రతిభావంతంగా ‘సహస్ర ఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. ఈ అనువాదానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1963లో స్పానిష్ భాషలో ప్రసంగించి, తదనంతర కాలంలో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో క్యూబా దేశ అద్వితీయ నేత ఫిడెల్ కాస్ట్రోను సైతం అబ్బురపరిచిన మేధాసంపత్తి ఆయనది.

ఇంతటి ఉన్నత పదవులు అధిష్ఠించినా ఆయన జీవితాంతం అత్యంత నిరాడంబరుడిగా, నిజాయితీపరుడిగా బతికారు. తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయ అధికారిక నివాసానికి, రాజకీయాలకు దూరంగా ఉంచిన పారదర్శక పాలకుడు ఆయన. కానీ, విచారకరమైన విషయం ఏమిటంటే, జీవిత చరమాంకంలో రాజకీయ కుట్రల వల్ల కోర్టుల చుట్టూ తిరగడానికి తనకున్న స్వల్ప ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అయినా.. పీవీ వెరవలేదు. ప్రధాని అయ్యాక పీవీ మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇక్కడి మట్టిని ముద్దాడుతూ ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే’నని నొక్కిచెప్పిన తీరు ఆయనలోని వినమ్రతకు, మాతృభూమి పట్ల ఉన్న మక్కువకు నిదర్శనం. 2004 డిసెంబర్ 28న ఈ మేధావి తుదిశ్వాస విడిచారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశాన్ని, నవీన ఆర్థిక శకంలోకి నడిపించిన ఈ అపర చాణక్యుడి సేవలను స్మరించుకోవాల్సిన సందర్భం ఇది. ఆయనకు వినమ్ర నివాళి.

రామకిష్టయ్య సంగనభట్ల  

 వ్యాసకర్త సెల్ : 94405 95494